Skip to main content

40 ఏళ్లలో ఎన్నడూ లేనంత తగ్గిన ఓజోన్ రంధ్రం పరిమాణం: నాసా



ప్రపంచం అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తున్నప్పటికీ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో మాత్రం వెనుకబడే ఉంది. సూర్యుడి నుంచి వెలువడే హానికారక అతి నీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా చేసే ఓజోన్ పొర వాతావరణ కాలుష్యం కారణంగా పాడైపోతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఓజోన్ పొర రంధ్రం పరిమాణం ఈ ఏడాది తగ్గిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' శాస్త్రవేత్తలు చెప్పారు.

గత 40 ఏళ్లలో ఓజోన్ పొర రంధ్రం పరిమాణం ఎన్నడూ లేనంత అత్యల్పంగా ప్రస్తుతం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, రెండు నెలల్లో భూమి పై వాతావరణంలో వేడి ఉండడంతోనే ఓజోన్ పరిమాణం తగ్గిందని, అది పూర్తిగా కోలుకున్నట్లు భావించే పరిస్థితి లేదని వివరించారు.

ప్రతి ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో సాధారణ వాతావరణ పరిస్థితులు ఉన్న సమయంలో ఓజోన్ రంధ్రం దాదాపు 20 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ రంధ్రం పరిమాణం ఈ సారి మాత్రం సగానికి (10 మిలియన్ చదరపు కి.మీ) తగ్గినట్లు చెప్పారు. ఉపగ్రహ డేటా ఆధారంగా నాసా, నోవా సంస్థలు ఈ విషయాన్ని తేల్చాయి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.