రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని భావిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఉపాధి లభించిక తీవ్ర ఇక్కట్లపాలవుతున్న భవన నిర్మాణ రంగ కార్మికుల పట్ల సంఘీభావంతో విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు పవన్ కల్యాణ్ సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఈ ర్యాలీ నవంబరు 3 మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ర్యాలీని పవన్ కల్యాణ్ ముందుండి నడిపిస్తారని జనసేన తన ప్రకటనలో పేర్కొంది. అయితే ర్యాలీ ఎక్కడి నుంచి నిర్వహించాలనేది ఇంకా ఖరారు కాలేదు. స్థానిక జనసేన నాయకులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Post a Comment