దసరా నవరాత్రులు, బతుకమ్మ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 10 రోజులపాటూ... దుర్గాదేవి అమ్మవారు... 10 అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. తొలిరోజైన నిన్న... అమ్మవారు... స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం ఇచ్చారు. నేడు... బాలత్రిపుర సుందరీదేవిగా దర్శనం ఇస్తున్నారు. మనస్సు, బుద్ధి, చిత్తం ఈ అమ్మవారి అధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం... ఉపాసకులు బాల రచన చేస్తారు. ఈ రోజు 2 నుంచి 10 ఏళ్ల లోపు బాలికల్ని అమ్మవారి స్వరూపంగా... పూజించి... కొత్త బట్టలు పెడతదారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి... పాయసం, గారెలను నైవేద్యంగా ఇస్తారు.
అక్టోబర్ 1న అమ్మవారు... గాయత్రీ దేవిగా, 2న అన్నపూర్ణాదేవిగా, 3న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 4న మహాలక్ష్మి దేవిగా, 5న సరస్వతీ దేవిగా, 6న దుర్గాదేవిగా, 7న మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక దసరా నాడు అక్టోబర్ 8న రాజరాజేశ్వరి దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. ఆ రోజు కృష్ణానదిలో తెప్పోత్సవం జరగనుంది. శ్రీశైలం, బాసర, వరంగల్ భద్రకాళి మాత ఆలయం సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఆలయాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా సాగుతున్నాయి.
Comments
Post a Comment