టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో వైసీసీ నేత విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. ఆర్టీసీని అప్పుల బారి నుంచి రక్షించి అనేక అవార్డులు వచ్చేలా చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు అని తెలిపారు. ఆర్టీసీని నాశనం చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది మీ మహామేత అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. జరిగిన వాస్తవం ఇదైతే, నువ్వు ట్విట్టర్ లో రాసుకుందే చరిత్ర అనుకుంటే ఎలా శకుని మామా? అంటూ ట్వీట్ లో నిలదీశారు.
శకుని మామా, ఎవరి హయాంలో ఆర్టీసీ నాశనమైందో ఓ పుస్తకం తయారుచేసి పంపిస్తాను, తీరిగ్గా చదువుకుందువుగాని అంటూ వ్యాఖ్యానించారు. "అప్పుడప్పుడు కాస్త వేరే పేపర్లు కూడా చదువుతుండు శకుని మామా, మీ తుగ్లక్ పాలన ఎంత బాగుందో అర్థమవుతుంది. 90 శాతం వలంటీర్లు మన కార్యకర్తలే అని పబ్లిగ్గా మాట్లాడిన నువ్వా వారి ఘనకార్యాల గురించి మాట్లాడేది?" అంటూ విమర్శించారు.

Comments
Post a Comment