Skip to main content

వెన్నునొప్పికి ఆపరేషన్‌ వద్దంటున్న పవన్‌...ప్రకృతి వైద్యం వైపు జనసేనాని మొగ్గు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ఆరోగ్యం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో అది ఎక్కువ కావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షించిన వైద్యుల బృందం పరిస్థితి మరింత విషమించక ముందే శస్త్ర చికిత్స చేయించుకుంటే మంచిదని సూచించారు.

అయితే ఇందుకు పవన్‌ కల్యాణ్‌ అంగీకరించలేదని సమాచారం. పార్టీ పనులను కొన్నాళ్లు పక్కనపెట్టి వెన్నునొప్పికి నేచర్‌ క్యూర్‌ పద్ధతి (ప్రకృతి వైద్యం)లో చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట

Comments