Skip to main content

ప్రారంభమైన బోటు వెలికితీత పనులు.. అవసరమైన సామగ్రితో ఘటనా స్థలానికి బయలుదేరిన సత్యం బృందం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో ఇటీవల పర్యాటకులతో వెళ్తూ మునిగిపోయిన బోటును వెలికి తీసే పనులు ప్రారంభమయ్యాయి. బోటును వెలికి తీసేందుకు ప్రయత్నించిన నేవీ, సహాయక బృందాలు వెనుదిరగడంతో ప్రభుత్వం ఆ బాధ్యతను బాలాజీ మెరైన్ సంస్థకు అప్పగించింది. దీంతో సంస్థ యజమాని ధర్మాడి సత్యం.. తన బృందం సభ్యులైన 25 మందితో వెలికితీతకు బయలుదేరారు.

బోటును వెలికి తీసేందుకు అవసరమైన క్రేన్, ప్రొక్లెయిన్, బోటు, పంటు, 800 మీటర్ల వైరు బోటు, రెండు లంగర్లు, మూడు లైలాండ్ రోప్‌లు, పది జాకీలు, ఇతర సామగ్రిని ఘటనా స్థలానికి తరలిస్తున్నారు. బోటు వెలికితీత నేపథ్యంలో ఆ  ప్రాంతానికి ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

Comments