ఏపీ సర్కారుపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరెంటు కోతల అంశాన్ని ప్రస్తావిస్తూ, పీపీఏలను మూర్ఖంగా రద్దు చేసిన ఫలితమే రాష్ట్రంలో ఈ అంధకారం అని వ్యాఖ్యానించారు. ఇది రివర్స్ డెవలప్ మెంట్ ప్రభుత్వం అని, అందుకే కరెంటు కోతలు విధిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ సర్కారు తీసుకువచ్చిన నిరంతర విద్యుత్ ను కూడా రివర్స్ చేశారని మండిపడ్డారు. 9 గంటల విద్యుత్ అని చెప్పి సగం కోత విధించారని చంద్రబాబు ట్విట్టర్ లో ఆరోపించారు.
థర్మల్ విద్యుత్ ఎప్పుడూ ఆధారపడదగింది కాదని, పైగా పర్యావరణ హితం కూడా కాదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని తాము ఎప్పుడో ఊహించామని, అందుకే సౌర, పవన విద్యుదుత్పత్తిని భారీస్థాయిలో ప్రోత్సహించామని తెలిపారు. తనకు తెలియంది ఎవరైనా చెబితే వినిపించుకోడని, ఆ జగమొండితనమే రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు శాపం అయిందని చంద్రబాబు విమర్శించారు.

Comments
Post a Comment