Skip to main content

4న వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర ప్రారంభం

పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
- 30 వరకు దరఖాస్తుల పరిశీలన
ఆటోలు, మాక్సీక్యాబ్‌, టాక్సీలు కొనుగోలు చేసి, వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు మేలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చేపట్టనున్న వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని అక్టోబర్‌ 4న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈనెల 14 నుండి 24 వరకు ఆటో, మాక్సీక్యాబ్‌, టాక్సీ డ్రైవర్లు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల ప్రక్రియకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. డ్రైవర్లకు అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం ఇన్స్యూరెన్స్‌, వెహికిల్‌ ఫిట్‌ నెస్‌, మరమ్మత్తులు వంటి అవసరాలకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఆటో, ట్యాక్సీ, మాక్సి క్యాబ్‌ డ్రైవర్‌ కమ్‌ ఓనర్లు వాహన మిత్ర పథకంలో నిర్ణీత ధ్రువపత్రాలను పొందుపరచడం ద్వారా అర్హత పొందుతారు. ఈ పథకానికి అర్హులైన వారు.. ఆధార్‌ కార్డు, తెల్ల రేషన్‌ కార్డు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రుణం లేని బ్యాంక్‌ పాస్‌ బుక్‌ మొదటి పేజీ, సంబంధిత అకౌంట్‌ వివరాలను సమర్పించాలని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. అలాగే ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలైతే తమ కులధవీకరణ పత్రం కూడా సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. సమర్పించిన ధ్రువపత్రాలను గ్రామ, వార్డు వాలంటీర్లు పరిశీలించి వాహనం సదరు యజమాని సమక్షంలో ఉందో లేదో పరిశీలించనున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,75,218 దరఖాస్తులు రవాణాశాఖకు అందినట్లు సమాచారం. అధికారులు వీటిలో నేటికి 93,741 దరఖాస్తులను పరిశీలించి ఆమోదముద్ర వేశారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.